Spirit First Glance Out As New Yr Present
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ కానుకగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌తోనే ‘స్పిరిట్’ సినిమా ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపెట్టారు వంగా. రూత్‌లెస్ కాప్‌గా ఈ సినిమాలో ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్‌లో వారిద్దరికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉండబోతుందా అని ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్ ఈ లుక్స్ పరంగా ఎలా ఉండబోతున్నాడో.. ఈ సినిమాలో అతని పాత్ర ఎంత కఠినంగా ఉంటుందో ఈ లుక్ లో రివీల్ చేశారు. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన వంటి స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
The publish స్పిరిట్ ఫస్ట్ లుక్ : ఇండియన్ సినిమా ఆజానుబాహుడు వచ్చేసాడు..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
