
పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా పై క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై పవన్ ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయికి చేరాయి.
పవన్ కల్యాణ్ కొన్ని రోజులు షూటింగ్ కోసం కేటాయించారని సమాచారం. దీంతో మేకర్స్ మరింత స్పీడ్ పెంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కు సిద్ధమవుతున్నారు. ఫ్యాన్స్ ఎప్పుడు సాంగ్ ప్రోమో కావాలో చెప్పండి అంటూ ఓ పోల్ కూడా నిర్వహించారు.
ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన “ఛావా” సినిమా శంభాజీ మహారాజ్ జీవిత కథను చూపించి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు హరిహరవీరమల్లు కూడా ఒక అద్భుతమైన హిస్టారికల్ ఫిక్షన్ కావడంతో ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి పెరిగింది.
హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ “మీ ఊహకు మించి ఈ సినిమా ఉంటుంది” అని చెప్పడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
భారీ బడ్జెట్, పవన్ కల్యాణ్ స్టామినా, గ్రాండ్ విజువల్స్ కలిపి ఈ సినిమాను ఓ ప్యాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీగా నిలపనున్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ మాత్రం మాట వినాలి అంటూ హరిహరవీరమల్లు రిలీజ్ డేట్ ఖరారు చేయమని డిమాండ్ చేస్తున్నారు.