Allu Arjun Magazine Cover Photo.
Allu Arjun Magazine Cover Photo.

“ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా” మ్యాగజైన్ తన తొలి సంచికలో అల్లు అర్జున్‌ను కవర్ ఫోటోగా ఎంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మ్యాగజైన్ టీం మన దేశంలో కూడా పబ్లిష్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌తో ప్రత్యేకంగా ఓ ఫోటో షూట్ నిర్వహించింది. ఈ ఫోటో షూట్ కు సంబందించిన వీడియోలను కూడా విడుదల చేసింది.

అల్లు అర్జున్ ఫోటోతో పాటు “ది రూరల్” అనే ట్యాగ్‌లైన్‌ను కూడా మ్యాగజైన్ కవర్ పై చేర్చింది. అయితే ఈ ట్యాగ్‌లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ అభిమానులు ఈ ట్యాగ్ లైన్ పై భిన్నంగా స్పందిస్తున్నారు.

అల్లు అర్జున్ తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. “పుష్ప” సినిమాతో ఆయన పాన్-ఇండియా స్టార్‌గా మారారు. ఇప్పుడు హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పై కనిపించడం ఆయన కెరీర్‌లో మరో మైలురాయి.

“ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా” మ్యాగజైన్ కవర్ పై అల్లు అర్జున్ ఫోటో ఆయన అభిమానులకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ ఫోటో షూట్ కు సంబందించిన మరిన్ని వివరాలకోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *