1000 Vaala Movie Valentine’s Day Poster
1000 Vaala Movie Valentine’s Day Poster

సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో, నూతన నటుడు అమిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం 1000 వాలా. యువ దర్శకుడు అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

హీరో అమిత్ మాట్లాడుతూ, “ప్రేమ అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ ప్రత్యేకమైన అనుభూతి. మా సినిమా 1000 వాలా ప్రేమ, అనుభూతి, యాక్షన్, ఎమోషన్‌లతో మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందింది. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా మా సినిమా నుండి ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. నా కలను నిజం చేసిన మా నిర్మాత షారుఖ్ కు ధన్యవాదాలు. త్వరలోనే మీ ముందుకు వస్తున్నాం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *