Published on Dec 13, 2024 4:23 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సంధ్య థియేటర్ ఘటన కారణంగా శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆయనను విచారించిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
అయితే, తాజాగా అల్లు అర్జున్‌కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను మరికాసేపట్లో చంచల్‌గూడ జైలుకి తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ వార్తతో బన్నీ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.