
‘ఛావా’ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చారిత్రక గాథ 6 రోజుల్లోనే రూ.197.75 కోట్లు వసూలు చేసింది.
ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా, రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా, అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా కనిపించి ప్రేక్షకులను అలరించారు.
ఇప్పటికే ఈ సినిమా మధ్యప్రదేశ్‌లో పన్ను మినహాయింపు పొందింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ నిర్ణయాన్ని ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, అక్కడి ప్రేక్షకులకు టిక్కెట్ రేట్లు తగ్గనుండడంతో థియేటర్లలో భారీ సందడి కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ సినిమాపై స్పందించారు. “ఛావా చరిత్రను వక్రీకరించకుండా అద్భుతంగా తెరకెక్కించారని చాలా మంది చెప్పారు. మరింత మంది చూసేలా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము” అని తెలిపారు.
ట్రైలర్, టీజర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు పన్ను మినహాయింపు రావడంతో 200 కోట్ల మార్కును త్వరలోనే ఛావా దాటనుంది.
విక్కీ కౌశల్ పెర్ఫార్మెన్స్, గ్రాండ్ విజువల్స్ తో ఈ సినిమా హిస్టారికల్ బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతోంది.