Rewind 2024 : ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన 2024 టాలీవుడ్ సినిమాలు

ఇండియన్ సినిమాలు ప్యాన్ ఇండియాలోనే కాకుండా  ఓవర్సీస్ మార్కెట్ లో కూడా  సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలెక్షన్స్ రాబడుతున్నాయో ఓవర్సీస్ లో కూడా అంతే స్థాయిలో ఒక్కోసారి అంతకు మించి ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. 2024 లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే

1) కల్కి2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 1200 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్ లో రూ. 275 కోట్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

2) పుష్ప – 2 : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. హిందీలో రూ. 800 కోట్లు రాబట్టిన ఈ సినిమా కేవలం 25 రోజుల్లో రూ. 264 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతుంది.

3) దేవర – యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు 6 ఏళ్ల సోలో రిలీజ్ తర్వాత వచ్చిన చిత్రం దేవర. వరల్డ్ వైడ్ గా రూ. 800 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఓవర్సీస్ లో రూ. 75 కోట్లు రాబట్టింది.

4 ) హనుమాన్ – యంగ్ హీరో తేజ సజ్జా బిగ్గిస్ట్ హిట్ హనుమాన్ ఓవర్సీస్ లో రూ. 57. 3 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది.

5 ) టిల్లు స్క్వేర్ -DJ టిల్లు కు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ తో పోటీపడుతూ ఓవర్సీస్ మార్కెట్ లో రూ. 30 కోట్లకు కలెక్ట్ చేసింది

6) గుంటూరు కారం – సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టిన ఓవర్సీస్ మార్కెట్ లో రూ. 29 కోట్లు కొల్లగొట్టింది.

7 ) సరిపోదా శనివారం – నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం టాలీవుడ్ లో సూపర్ హిట్ కాగా ఓవర్సీస్ లో రూ. 27. 4 కోట్లు సంపాదించి సూపర్ హిట్ గా నిలిచింది.

8) లక్కీ భాస్కర్ – దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఫైనల్ రన్ లో ఓవరీస్ నుండి రూ. 27.5 కోట్లు కొల్లగొట్టాడు లక్కీ భాస్కర్

 

NOTE : ఈ వివరాలు మేము వివిధ మార్గాల ద్వారా కలెక్ట్ చేసి అందిస్తున్నాము. వీటికి మాకు ఏ విధమైన సంబంధం లేదు. గమనించగలరు. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *