రజినీకాంత్ (Rajnikanth) హీరోగా నటిస్తున్న క్రేజీ మూవీ కూలీ (Coolie) షూటింగ్ గురించి ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh kanakaraj) మాట్లాడుతూ జూలై నుంచి కూలీ సినిమా రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేస్తామని తెలిపారు. కూలీ సినిమా ఆ మధ్య అఫీషియల్ గా లాంఛ్ అయ్యింది. లాంఛింగ్ టైమ్ లో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ తో ఇదొక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని వెల్లడైంది.

బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో కూలీ సినిమా తెరకెక్కనుంది. సన్ పిక్చర్స్ (Sun pictures) నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోల్డ్ స్మగ్లర్ గా రజినీకాంత్ కనిపించనున్నారు. స్మగ్లింగ్, డ్రగ్స్, క్రైమ్ నేపథ్యంలో సినిమాలు చేస్తూ వస్తున్న లోకేష్ కనకరాజ్ మరోసారి తన లైన్ లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో, స్టార్ కాస్టింగ్ తో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.