News June 27, 2024

రాత్రి వేళ వెలుగును ఎక్కువగా చూడటం, వెలుతురులో ఉండటం వల్ల టైప్2 మధుమేహ ముప్పు 67% పెరుగుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. వెలుగు వల్ల మానసిక, శారీరక మార్పులు ఏర్పడి గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బతింటుందని సైంటిస్టులు తెలిపారు. ఇది చక్కెర స్థాయులు క్రమబద్ధీకరించే శక్తి తగ్గిపోయేలా చేసి, డయాబెటిస్ రావడానికి దారి తీస్తుందన్నారు. రాత్రి వేళ స్క్రీన్ చూడటం తగ్గించి, రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలంటున్నారు.