పాన్ ఇండియా బాక్సాఫఈస్ వద్ద కల్కి మేనియా కొనసాగుతుంది. ఎన్నో అంచనాల మధ్య ఈరోజు కల్కి 2898 ఏడీ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. మన పురాణాలను ఆధారంగా చేసుకుని కాశీ, కంప్లెక్స్, శంబల అనే మూడు మాయ ప్రపంచాలను సృష్టించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. విష్ణు అవతారంలో పదవ అవతారమైన కల్కి ఆధారంగా ఈ మూడు ప్రపంచాలలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయి.. అసలు ఆశ్వద్థామకు, బైరవకు మధ్య వివాదం ఏంటీ అనే ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఈ మూవీ కోసం ఉపయోగించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాగా.. అర్థరాత్రి నుంచే థియేటర్స్ వద్ద డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టారు. డప్పులు, భారీ కటౌట్స్ తో సందడి చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, శోభన, మాళవిక నాయర్ కీలకపాత్రలు పోషిస్తున్నట్లు ఇదివరకే మేకర్స్ రివీల్స్ చేశారు. ఇక విడుదలకు కొన్ని గంటల ముందు ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం నటిస్తున్నట్లు అధికారికంగా పోస్టర్స్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ నడిపే బుజ్జి కారుకు కీర్తి సురేష్ వాయిస్ అందించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాను ఇప్పటికే చూసిన అడియన్స్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా మంది తారలు గెస్ట్ రోల్స్ చేశారు. ఇప్పుడు వారందరి పేర్లు.. అందుకు సంబంధించిన విజువల్ వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ సినిమాలో ఉన్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించగా.. ఇప్పుడు మరో ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కెవి అనుదీప్ తోపాటు.. ఫరియా అబ్దుల్లా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ కథకు తగ్గట్లుగా గెస్ట్ రోల్స్ పోషించారట.

ఇదిలా ఉంటే.. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రోడ్యూసర్ అశ్వినిదత్ నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ బుకింగ్ టికెట్స్ రికార్డ్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. అటు అమెరికాలోనూ విధ్వంసం సృష్టిస్తుంది కల్కి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.