సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ థియేటర్లలోకి వచ్చేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సుమారు 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. ఇక గురువారం తెల్లవారుజాము నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కల్కి షోలు మొదలవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తారు. మొదటి ఆట నుంచే సినిమాకు హిట్ టాక్ రావడంతో రెబల్ స్టార్ అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కల్కి టాక్ అలా ఉంచితే.. బడ్జెట్ ఎంతైనా.. ఎంతటి హిట్ కొట్టినా.. కచ్చితంగా అది ఓటీటీలోకి రావాల్సిందే.

ఈ తరుణంలో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ ఓటీటీ పార్ట్‌నర్ లాక్ అయింది. సాధారణంగా రిలీజైన ఏ సినిమా అయినా నెల రోజుల వ్యవధిలో ఓటీటీలోకి వస్తోంది. అయితే కల్కి మూవీ అలా కాదు. ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక కల్కి మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు సినిమా డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. అయితే చివరికి కల్కి 2898 ఏడీ ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియోకు దక్కాయి. కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై త్వరలో నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించే ఛాన్స్ ఉంది.

మరోవైపు ఈ చిత్రాన్ని భారతీయ పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇందులో ప్రభాస్‌తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. రిలీజ్‌కి ముందే భారీ అంచనాలు అందుకున్న ఈ చిత్రం.. విడుదల తర్వాత మరిన్ని రికార్డులు తిరగరాసేందుకు సిద్దంగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తస్సాదియ్యా.! ఏం అందం.. నానితో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే స్టన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..