ప్రస్తుతం బుల్లితెరపై పరభాష నటీనటులే ఎక్కువగా కనిపిస్తున్నారు. కన్నడ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది తారలు ఇప్పుడు తెలుగు సీరియల్స్‏లో మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తమదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. యాక్టింగ్ నచ్చిచే చాలు భాషతో సంబంధం లేకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు తెలుగు అడియన్స్. ఇక బుల్లితెర అడియన్స్ మాత్రం సీరియల్ నటీనటులను తమ ఇంటిసభ్యులుగానే అభిమానిస్తుంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ రెండు జళ్ల సీతకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఓ పాపులర్ సీరియల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఆ అమ్మాయి.. బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో మాత్రం తన కామెడీ టైమింగ్, పంచులతో అదరగొట్టేస్తుంది. వచ్చి రాని తెలుగులో ఆ అమ్మాయి మాట్లాడే మాటలు ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. అలాగే ఆమె పంచులకు యాంకర్స్ సైతం తల పట్టుకోవాల్సిందే. ఈ మధ్య కాలంలో ఈ అమ్మాయి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? తనే బ్రహ్మముడి ఫేమ్ కావ్య అలియాస్ దీపికా రంగరాజు.

దీపికా రంగరాజు తమిళంలో పలు సీరియల్స్ చేసింది. బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. నటన, చిలిపితనంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్స్ బెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో టాప్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్లో కావ్య పాత్ర ద్వారా తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను దగ్గరైన దీపికను ఇప్పుడు అందరూ తమ కుటుంబసభ్యురాలిగా చూస్తున్నారు. ఇక ఈ సీరియల్ ద్వారా కాకుండా స్టార్ మా నిర్వహించే పలు రియాల్టీ షోలలో దీపికా చేసే అల్లరి మాములుగా ఉండదు.

కామెడీ పంచులు, డాన్స్ తో స్టేజ్ పై నవ్వులు పూయిస్తుంది. రియాల్టీ షోల ద్వారా మరింత పాపులర్ అయ్యింది కావ్య. ఇదిలా ఉంటే.. తాజాగా దీపికకు సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. తన పాత ఫోటోలతోపాటు కొత్త ఫోటోలను కంపేర్ చేస్తూ ఓ వీడియో షేర్ చేసింది దీపిక. ఇక కావ్యను చిన్నప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేం. చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న కావ్య. బూరి బుగ్గలతో భలే ముద్దుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి దీపిక ఎంట్రీ ఇస్తుందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం తెలియలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.