యూఎస్ బాక్సాఫీస్ (US boxoffice) వద్ద రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebelstar Prabhas) కల్కి (Kalki 2898AD) సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి కల్కి మిలియన్ డాలర్స్ కు చేరింది. ఒక స్టార్ సినిమా ఫుల్ రన్ లో వచ్చే కలెక్షన్స్ కల్కి ఒక్కరోజులోనే క్రాస్ చేసింది. ఆర్ఆర్ఆర్ (RRR) తో పాటు బాహుబలి2 (bahubali 2) రికార్డులు కూడా కల్కి ప్రభంజనంలో తుడిచిపెట్టుకుపోయాయి.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో కల్కి ఐదో స్థానాన్ని ఒకే ఒక్క రోజులో అందుకుంది. ఇక ఫాస్టెస్ట్ 5 మిలియన్ (5 Million) మూవీగా కూడా కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది. వన్ వీక్ గట్టిగా ఇదే క్రేజ్ తో కంటిన్యూ అయితే యూఎస్ లో కల్కి ఇక ఇప్పట్లో మరెవరూ టచ్ చేయలేని ఎవర్ గ్రీన్ బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం.