మహాభారతం (Mahabharatam) సినిమాను రూపొందించడం తన కల అని దర్శకుడు రాజమౌళి (Director rajamouli) తరుచూ చెబుతుంటారు. ఈ సినిమా కోసం పదేళ్ల టైమ్ కేటాయిస్తానని కూడా ఆయన గతంలో వెల్లడించారు. ఆయన అలా చెప్పిన సందర్భంలో మహేశ్ బాబు (Maheshbabu), ప్రభాస్ (Prabhas), రామ్ చరణ్ (Ramcharan)…ఇలా స్టార్ హీరోలతో మహాభారతంలోని అర్జునుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు..ఇలా పాత్రల గెటప్ లతో పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

రాజమౌళి మహాభారతం సినిమా చేస్తే అందులో అర్జునుడి (Arjuna) క్యారెక్టర్ కు విజయ్ దేవరకొండ (Vijay devarakonda) బెస్ట్ ఆప్షన్ గా మారడం ఖాయం. ఎందుకంటే నిన్న రిలీజైన కల్కిలో అర్జునుడి పాత్రలో మెరిసిన విజయ్…లుక్స్, మేకోవర్, అర్జునుడి పాత్రలోని టెంపర్ మెంట్ అన్నింట్లో పర్పెక్ట్ సెట్ అయ్యాడు. కల్కి మూవీలో చాలా మంది స్టార్స్ గెస్ట్ రోల్స్ చేసినా మహాభారతం ఎపిసోడ్ లో అర్జునుడిగా విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం హైలైట్ అయ్యింది.