యాక్షన్ అంటే హీరోలే చేయాలనే రోజులు పోయాయి. ఓటీటీ ట్రెండ్ (OTT trend) వచ్చాక, హాలీవుడ్ ఇన్ ఫ్లుయెన్స్ తో మన హీరోయిన్స్ చాలా ఫైట్స్ చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో భారీ యాక్షన్ సీక్వెన్సులు పర్ ఫార్మ్ చేస్తున్నారు. తమన్నా (Thamanna bhatia) ఇదివరకు యాక్షన్ సీక్వెన్సులు చేసింది. ఇప్పుడు తన కొత్త సినిమా ఓదెల 2 (Odela 2) కోసం ట్రైనింగ్ తీసుకుని మరీ యాక్షన్ పర్ ఫార్మ్ చేస్తోందట. తమన్నా లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.

ఇందులో తమన్నా చేస్తున్న భారీ స్టంట్స్ (actions sequences) రూపొందిస్తున్నారు. మూడేళ్ల కిందట ఓటీటీలో రిలీజై మంచి సక్సెస్ సాధించిన ఓదెల (Odela) సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అశోక్ తేజ. దర్శకుడు సంపత్ నంది (Sampath nandi ) నిర్మిస్తూ ఈ కాన్సెప్ట్ ను క్రియేట్ చేశారు. ఈ సినిమాలో తమన్నా శివశక్తిగా (Shiva shakti) కనిపించబోతోంది. ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని మూవీ టీమ్ చెబుతున్నారు.