ఇటీవల సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది యాంటీ డ్రగ్ యాడ్ (anti drug ad). మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) ప్రచారకర్తగా యాంటీ నార్కొటిక్స్ బ్యూరో కోసం తెలంగాణ ప్రభుత్వం (Government of telangana) ఈ యాడ్ ను రూపొందించింది. టమాడా మీడియా ప్రొడ్యూస్ చేసిన ఈ యాడ్ కు దర్శకత్వం వహించారు యువ దర్శకుడు సంజీవ్ రెడ్డి (Sanjeev reddy). ఈ యాడ్ తో ఆయన మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం అందుకున్నారు. మెగాస్టార్ కు పెద్ద అభిమాని అయిన సంజీవ్ రెడ్డి ఆయనతో యాడ్ రూపొందించే అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ యాడ్ ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm revanth reddy) చేతుల మీదుగా రిలీజైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ గురించి ట్వీట్ చేస్తూ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వచ్చేవారం నుంచి ఈ యాడ్ ను తెలంగాణలోని ప్రతి థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు. ఈ యాడ్ చేయడం పట్ల సంజీవ్ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ – ఎవరి సినిమాలు చూస్తూ పెరిగి సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నానో ఆ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు భాగస్వామి అయిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ థియేట్రికల్ యాడ్ లో నేనూ ఒక భాగమైనందుకు, ఇక చాలు ఈ జన్మ కి అనిపిస్తుంది. కానీ, మళ్ళీ ఈ కోరికలకు అంతే ఉండదు. అని అన్నారు.