శివాజీ (Actor shivaji) హీరోగా సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఆర్టిస్టుగా మెప్పించాడు. తన కెరీర్ లో విలన్ సహా ఎన్నో భిన్నమైన రోల్స్ లో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తనకు బిగ్ కమ్ బ్యాక్ లాంటి మూవీలో జాయిన్ అయ్యారు. ఆ సినిమానే “కూర్మనాయకి” (Kurmanayaki). ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ (Roshan productions) లో కె విజితా రావ్ (K vijitha rao) నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో హై టెక్నికల్ వ్యాల్యూస్, వీఎఫ్ఎక్స్ లతో భారీ పాన్ ఇండియా మూవీగా “కూర్మనాయకి” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల (Harshavardhan kadiyala).

శివాజీ బర్త్ డే (Happy birthday) సందర్భంగా స్పెషల్ వీడియోతో మూవీలోకి వెల్కమ్ చెప్పింది “కూర్మనాయకి” టీమ్. భువనగిరిలోని స్వర్ణగిరి టెంపుల్ లో చేసిన సీన్ ను ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియోతో “కూర్మనాయకి”లో శివాజీ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తో ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న శివాజీ కెరీర్ ను ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటించనున్నారు. ఆయన ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు.