News June 29, 2024

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,020 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4,238 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. MBNR-70.21శాతం, GDWL-87.80 శాతం, WNPT-95.36శాతం, NGKL-93.40 శాతం, NRPT-76.73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.