News June 30, 2024

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని<<13518740>>(ISS)<<>> కూల్చివేసేందుకు నాసా ప్రణాళికలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో 843 మిలియన్ డాలర్లు(రూ.7000 కోట్లకు పైమాటే) ఒప్పందం కుదుర్చుకుంది. దీని జీవిత కాలం 2030తో ముగుస్తుంది. ఆ తర్వాత దీన్ని తొలగించనున్నారు. ఇది భూమికి 400km ఎత్తులో పరిభ్రమిస్తుంటుంది. US, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా దేశాలు దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి.