News June 30, 2024
AP: DSC కంటే ముందే TET నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెట్-2024 షెడ్యూల్, నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, ఆన్లైన్లో జరిగే పరీక్షలపై జులై 2న పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. https://cse.ap.gov.in/ వెబ్సైటులో ఎల్లుండి వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఏదైనా సమాచారం కావాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్కును సంప్రదించాలంది.