ఏపీ ఎన్నికల్లో జనసేన (Janasena) ఘన విజయం తర్వాత ప్రభుత్వంలో డిఫ్యూటీ సీఎం (AP DYCM)గా బాధ్యతలు చేపట్టారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ రాజకీయ విరామంతో ఆయన సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని తిరిగి ప్రారంభించబోతున్నారు పవన్. అలా ఆగిపోయిన సినిమాల్లో హరి హర వీరమల్లు (Hari hara veeramallu) కూడా ఉంది. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ లో పవన్ జాయిన్ అవుతారని తెలుస్తోంది.

హరి హర వీరమల్లు చిత్రాన్ని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం (Am Ratnam) నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhi agarwal) హీరోయిన్ గా నటిస్తోంది. క్రిష్ (Krish) దర్శకుడిగా ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు రత్నం కొడుకు జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్లింది. ఆయన డైరెక్షన్ లో సినిమా కంప్లీట్ చేయనున్నారు. పీరియాడిక్ యాక్షన్ మూవీగా హరి హర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.