డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Director shekar kammula)కు పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కువ. ఆయనలో ఓ బిగ్ పొలిటికల్ అనలిస్ట్ ఉంటాడు. ఏ పార్టీ ఎలా ఎత్తులు వేస్తుందో, ఎ‌వరు ఏ పార్టీలోకి వెళ్తారో, ఏ పార్టీ ఎందుకు గెలుస్తుందో ముందే చెప్పగలరు శేఖర్ కమ్ముల. ఈ రాజకీయ పరిజ్ఞానం ఉండటం వల్లే లీడర్ (Leader) వంటి మంచి పొలిటికల్ డ్రామా తెరకెక్కించారు. రానా (Rana) హీరోగా నటించిన లీడర్ సినిమా సక్సెస్ అయ్యింది. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట శేఖర్ కమ్ముల.

లీడర్ 2 అనే టాక్ వినిపిస్తున్న ఈ సినిమాలో నాని (Nani) హీరోగా నటిస్తారనే అంటున్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల, నాని సినిమాకు డిస్కషన్స్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna) కీ రోల్స్ లో కుబేర (Kubera) చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నెక్ట్ ప్రాజెక్ట్ లీడర్ 2నే కానుందని అనుకోవచ్చు.