గతేడాది థియేటర్స్ లో కలెక్షన్స్ వర్షం కురిపించిన బేబి (Baby) సినిమాపై ఇప్పుడు అవార్డులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆనంద్ దేవరకొండ (Anand devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj ashwin) హీరో హీరోయిన్లుగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ (SKN) నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ (Sai rajesh) ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో 100 కోట్ల రూపాయల గ్రాసర్ గా నిలిచిన బేబి…మొత్తం సౌత్ లో సూపర్ సక్సెస్ అందుకుంది. బేబి సినిమా ఆనంద్ దేవరకొండకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. కల్ట్ బొమ్మగా పేరు తెచ్చుకున్న “బేబి” ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఈ సినిమాకు దక్కిన అవార్డ్స్ చూస్తే…

గామా అవార్డ్స్ (Gama Awards) లో బెస్ట్ యాక్టర్ గా ఆనంద్ దేవరకొండకు అవార్డ్ సొంతమైంది. చెన్నైలోని కళాసుధ అవార్డ్స్, సంతోష్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్, ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ బెంగళూరు, కట్ మిర్చి ఇంటర్నేషనల్ తెలుగు ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్, కెనడా, దర్శకరత్న దాసరి అవార్డ్స్, కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్, హెఎం రెడ్డి అవార్డ్..ఇలా స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ దాకా అన్ని మేజర్ అవార్డ్స్ దక్కించుకుంది బేబి మూవీ.