వెంకటేష్ (venkatesh) హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil ravipudi) రూపొందిస్తున్న సినిమాలో మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నాయికగా ఎంపికైంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ మాజీ భార్యగా, మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసిగా కనిపించనున్నారు. మాజీ పోలీస్ అధికారిగా వెంకటేష్ నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ కు వెల్కమ్ చెబుతూ ఈ సినిమా టీమ్ ఆమె పోస్టర్ రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ లో వెయ్యి ఎపిసోడ్ల డైలీ సీరియల్ లో హీరోయిన్ లా కనిపిస్తోంది ఐశ్వర్య రాజేష్. ఈ సినిమాకు రేపు ఉదయం 11.16 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్ రాజు (Dil raju) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్ 2 (F2), ఎఫ్ 3 (F3) తర్వాత వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రమిది. వెంకీ అనిల్ కాంబో సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.