డ్రగ్స్ వ్యతిరేక క్యాంపెయిన్ లో పాల్గొన్నందుకు మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi)కి తన అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి (CM revanth reddy). మెగాస్టార్ లా మరింత మంది స్టార్స్ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనాల్సిందిగా సీఎం కోరారు. సినీ పరిశ్రమలో భారీ చిత్రాలు నిర్మించే దర్శక నిర్మాలు తమ సినిమాల్లోని స్టార్స్ తో డ్రగ్స్, సైబర్ క్రైమ్ (Cyber crime) కు వ్యతిరేకంగా వీడియోస్ చేసి ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇది విధిగా ప్రతి స్టార్, పెద్ద దర్శక నిర్మాతలు పాటించాలని ఆయన అన్నారు. భారీ చిత్రాలు తీసి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రభుత్వం దగ్గరకు రావడం కాదు మీరు మీ సామాజిక బాధ్యత కూడా గుర్తుపెట్టుకోవాలి. సినిమా మేకర్స్ షూటింగ్ పర్మిషన్స్ కోసం వచ్చినప్పుడే పోలీస్ అధికారులు వారితో ఈ వీడియో గురించి మాట్లాడాలి అని రేవంత్ రెడ్డి చెప్పారు.