యంగ్ హీరో సుహాస్ (Suhas) కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ (Dil raju productions) నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘జనక అయితే గనక’ (Janaka aithe ganaka) అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు.

ఎంటర్ టైనింగ్ కోర్ట్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎల్లుండి ‘జనక అయితే గనక’ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘జనక అయితే గనక’ సినిమా టైటిల్ తో పాటు పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. స్కూల్ బ్యాగ్, టెడ్డీ బేర్ వంటి బొమ్మలతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు.