‘కల్కి   2898 ఏడీ’ తుఫాను కాదు సునామీ సృష్టిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ హిట్ దిశగా పరుగులు తీస్తుంది. ఈ యాక్షన్ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాకుండా విదేశాల్లోనూ కల్కి ఆధిపత్యం కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలై కేవలం 5 రోజులే అయినా చాలా మంది సూపర్ స్టార్ల సినిమాలను ఈ సినిమా బీట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.635 కోట్లకు పైగా వసూలు చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ వండర్ అనే చెప్పాలి. హాలీవుడ్ సినిమాలను బీట్ చేసేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటించారు.

కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా కమల్ హాసన్ కనిపించింది తక్కువ సేపే అయినా తన మార్క్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే అమితాబ్ ఈ సినిమాలో మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే హీరోయిన్స్ గా దీపికా పదుకొనె, దిశా పటాని నటించారు. వీరితో పాటు చాలా మంది టాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ కనిపించారు. ఇదిలా ఉంటే కల్కి మూవీ ట్రైలర్ విడుదలైనప్పుడు దీపికా డబ్బింగ్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి.

దాంతో సినిమాలో ఆమెకు బదులు మరో హీరోయిన్ తో డబ్బింగ్ చెప్పించారు. ఆమె ఎవరో కాదు తెలుగు హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో గూడచారి, మేజర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే హాలీవుడ్ లోనూ సినిమా చేసింది. ఇక కల్కి సినిమా తెలుగు వర్షన్ కు శోభిత డబ్బింగ్ చెప్పింది. తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయాన్నీ చెప్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. కల్కి సినిమా ఎండ్ లో థాంక్స్ నోట్ లో తన పేరు రాగానే దానికి లవ్ సింబల్ ఎమోజీ ని పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Kalki

శోభిత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..