ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాస్ చంద్రబోస్ గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో తాను ఇచ్చిన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తన సొంతూరులో ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు. అదేంటంటే.. తన సాహిత్యంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన చంద్రబోస్ ఆర్ఆర్ఆర్ మూవీలో ఆయన రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చిన సమయంలో చంద్ర బోస్ తన సొంతూరు అయిన జయశంకర్ భూపాల పల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలోని గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు. చల్లగరిగె ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలకు ముగ్ధుడైన ఆయన అక్కడ ఆస్కార్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారాయన. గ్రామంలో ఇది వరకు ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి రూ.36 లక్షలతో కొత్త భవనాన్ని చంద్రబోస్ నిర్మించారు. గురువారం (జులై 04)న ఈ ఆస్కార్ గ్రంథాయాన్ని ప్రారంభించనున్నారు. భూపాలపల్ల ఎమ్మెల్యే గండ్ర త్యనారాయణరావు, చంద్రబోస్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.

కాగా మొత్తం రెండు అంతస్థులతో సకల సౌకర్యాలతో ఆస్కార్ గ్రంథాయలయాన్ని నిర్మించారు చంద్ర బోస్. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలను ఈ గ్రంథాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ‘చల్ల గరిగె గ్రామస్థులకు ఇచ్చిన మాట ప్రకారం సరస్వతి గుడిని నిర్మించాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను చల్లగరిగలోని నా ఇంటి పక్కన ఉన్న గ్రంథాలయంలో ఎన్నో సాహిత్య పుస్తకాలు చదివాను. వాటి వల్లే నేను ఉన్నతస్థాయికి ఎదిగాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు చంద్ర బోస్. కాగా తన సాహిత్యంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుమారు 30 ఏళ్లుగా సేవలందిస్తున్నారాయన. ఇప్పటివరకు సుమారు 860 సినిమాల్లో 3600కి పాటలు రాశారు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. అంతకు ముందు కొండ పొలం సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ పాటకు ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్కార్ అవార్డుతో చంద్ర బోస్..

సైమా ఉత్సవాల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.