వైరల్ ఇన్ఫెక్షన్స్ (Viral infections) కు హైడ్రోజన్ పెరాక్సైడ్ (Hydrogen peraxide) ఇన్ హేల్ చేయమని సమంత చేసిన పోస్ట్ పై డాక్టర్స్ మండిపడుతున్నారు. ఇది తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యకు దారి తీస్తుందని, ఇలాంటి సలహా సమంత లాంటి సెలబ్రిటీ ఇవ్వడం ఎంతోమందిని తప్పుదారి పట్టించినట్లు అవుతుందని డాక్టర్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజర్ లో వేసి పీల్చడం అనేది కోవిడ్ గానీ ఇతర ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించదని, ఇలాంటి ప్రమాదకర సలహా ఇచ్చిన సమంతను జైల్లో వేయాలని డాక్టర్స్ పోస్ట్ లు చేస్తున్నారు.

డాక్టర్ ది లివర్ (TheleverDoc), డాక్టర్ పీవీ రమేష్, బ్యాట్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కూడా సమంతను విమర్శిస్తున్న వారిలో ఉన్నారు. తన పోస్ట్ వివాదాస్పదం కావడంతో సమంత స్పందించింది. తనకు తెలిసిన ఓ సీనియర్ వైద్యుడు చెప్పిన ప్రకారమే తాను హైడ్రోజన్ పెరాక్సైడ్ పీలుస్తున్నానని, ఇది వ్యాపార ప్రకటన కాదని సమంత సమాధానం ఇచ్చింది. సెలబ్రిటీగా అనవసర విమర్శలు ఎదుర్కోవడం తనకు కొత్త కాదని అంది. లక్షలకు లక్షలు డబ్బు పెట్టి ట్రీట్ మెంట్ తీసుకోలేని వారికి ఒక ఆప్షన్ గా ఈ వైద్యాన్ని సూచించానని సమంత పేర్కొంది.