ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు టాలీవుడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ రెండు సినిమాల్లోనూ విశ్వక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం లైలా అనే మరో డిఫరెంట్ సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్. ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కింది. షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా లైలా సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇందులో తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్నారు విశ్వక్ సేన్. సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా సోషల్ మీడియా నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు విశ్వక్ సేన్. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడీ ట్యాలెంటెడ్ హీరో. ‘అందరికీ హాయ్.. నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ‍అయితే నా ఇన్‌స్టాగ్రామ్‌కు చిన్న బ్రేక్ మాత్రమే. మీరు ఎవరు చింతించాల్సిన పనిలేదు. నా ట్విట్టర్‌ ఖాతాను నా టీమ్ నిర్వహిస్తుంది. నా ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేషన్‌ గురించి ఒత్తిడికి గురికావద్దు’ అని రాసుకొచ్చాడు విశ్వక్ సేన్.

కాగా గత కొన్ని రోజుల నుంచి విశ్వక్ సేన్ ఇన్ స్టా గ్రామ్ లో ఎలాంటి పోస్టులు లేవు. దీంతో అభిమానులు, నెటిజన్లు విశ్వక్ సేన్ కు ఏమైంది? అని ఆరా తీయడం మొదలు పెట్టారు. తాజాగా దీనిపై కూడా స్పందించాడీ హ్యాండ్సమ్ హీరో. ఇటీవల నా సోషల్ మీడియా ఖాతా డియాక్టివేషన్ కారణంగా అందరూ మేసేజులు పెడుతున్నారు. అంతా బాగానే ఉందా అని ప్రశ్నలు వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే సామాజిక మాధ్యమాలు నా వ్యక్తిగత జీవితాన్ని నిర్వచించలేవు. సోషల్ మీడియాను కొంత వరకు మాత్రమే సీరియస్‌గా తీసుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. మీ అందరికీ ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విశ్వక్ సేన్ నిర్ణయంపై ఫ్యాన్స్, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హీరో విశ్వక్ సేన్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.