ఓటీటీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మీర్జాపూర్ సీజన్ 3 (Mirzapur 3) స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సిరీస్ అమోజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది. మీర్జాపూర్ 3 చూస్తున్న వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న స్క్రీన్ షాట్స్ సందడి చేస్తున్నాయి. మీర్జాపూర్ పూర్వాంచల్ లో ఆధిపత్యం కోసం జరిగే పోరాటాన్ని ఈ థర్డ్ సీజన్ లో మరింత ఇంటెన్స్ గా తెరకెక్కించారు.

ఈ సిరీస్ లో అలీ ఫజల్ (Ali fazal), శ్వేతా త్రిపాఠీ (Swetha tripati), రసిక దుగాల్, ఇషా తల్వార్ (ISha talwar), పంకజ్ త్రిపాఠీ (Pakanj tripati) కీ రోల్స్ లో నటించారు. మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ను ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ (Exel media and entertainment) నిర్మించగా..గుర్మీత్ సింగ్, ఆనంద్ ఐయ్యర్ దర్శకత్వం వహించారు. మీర్జాపూర్, మీర్జాపూర్ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ సీజన్ కూడా ఆ సక్సెస్ రిపీట్ చేసేలా ఉంది.