సాధారణ పాత్రలతో అసాధారణ కథలు తెరకెక్కిస్తుంటారు దర్శకుడు శేఖర్ కమ్ముల (Shekar kammula). స్టార్స్ అయినా ఆయన సినిమాల్లో సాదాసీదాగా కనిపిస్తారు. రశ్మిక మందన్న (Rashmika mandanna) లుక్ ను కుబేర సినిమా నుంచి రిలీజ్ చేస్తున్నారంటే ఆమె ఎలా ఉంటుందో అని ఎక్స్ పెక్ట్ చేశారు ఆడియెన్స్. ఈ రోజు రశ్మిక ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆమె మేకోవర్ చాలా సాధారణంగా ఉంది. అయితే ఆమె క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందనే తెలుస్తోంది.

రశ్మిక ఫస్ట్ లుక్ గ్లింప్స్ లో అడవిలోకి వచ్చిన ఆమె తవ్వి ఓ సూట్ కేసు బయటకు తీస్తుంది, ఆ సూట్ కేసు నిండా డబ్బు చూసి సంతోషంగా పట్టుకుని వెళ్తుంది. ఈ డబ్బు రశ్మిక అడవిలో ఎందుకు దాచింది అనే క్యూరియాసిటీ గ్లింప్స్ క్రియేట్ చేసింది. స్టార్స్ తో స్క్రీన్ మీద ఆడంబరాలు చేసే కంటే వారిని పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకులకు దగ్గర చేయడం ఈ దర్శకుడికి అలవాటు. అదే కుబేరలోనూ రిపీట్ చేస్తున్నారు. నాగార్జున (nagarjuna), ధనుష్ (Dhanush) కీ రోల్స్ చేస్తున్న కుబేర చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.