ప్రభాస్‌.. ఇప్పుడు నేమ్ కాదు ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్రాండ్ అయిపోయాడ.ఇండియన్ బాక్సాఫీస్‌కి కింగ్ అయిపోయాడు. ఎంతలా అంటే.. ఒక్క ప్రభాస్ కారణంగానే ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దిమ్మతిరిగే లాభాలు పొందే అంతలా…! ఎస్ ! ఆఫ్టర్ బాహుబలి పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ పోతున్న ప్రభాస్‌.. ఆ బాహుబలి నుంచి రీసెంట్‌ హిట్ మూవీ కల్కి వరకు దాదాపు 7 పాన్ ఇండియా సినిమాలు చేశారు. ఆ సినిమాలతో మొత్తంగా 5 వేల కోట్లు బిజినెస్‌ .. సింగిల్ హ్యాండ్తో చేశాడు. ఇక ఇదే విషయాన్ని కొందరు ఫిల్మ్ అనలిస్టులు నెట్టింట కోట్ చేస్తున్నారు. ప్రభాస్ ఒక్కడి వల్లే.. ఫిల్మ్ ఇండస్ట్రీకి 5 వేల కోట్లు లాభం అంటూ.. పోస్టులు పెడుతున్నారు. ఆఫ్టర్ బాహుబలి పాన్ ఇండియా రేంజ్లో రికార్డులు బద్దలు కొట్టడం.. ఓ అలావాటుగా మార్చుకున్న ప్రభాస్‌.. ఇప్పుడు మహేష్ ఇలాకా అయిన AMB మల్టిప్లెక్స్‌లో కల్కి మూవీతో దిమ్మతిరిగే రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక హైద్రాబాద్లో ఉన్న ది బెస్ట్ మల్టిప్లెక్స్‌లలో.. ఒకటైన AMB మల్టిప్లెక్స్‌ లో ఉన్న 7 స్క్రీన్స్‌లలో డే1 కల్కి మూవీ మాత్రమే స్క్రీనింగ్ అయింది. అంటే ఆ ఒక్క రోజే AMB మల్టిప్లెక్స్‌లో మొత్తం 40 కల్కి షోలు పడ్డాయి. ఆ రోజు నుంచి సగం స్క్రీన్స్‌లో కల్కి మూవీనే ఇంకా స్క్రీనింగ్ కూడా అవుతోంది. ఇక ఈకమ్రంలోనే కల్కి మూవీ ఒక్క AMB మల్టిప్లెక్స్‌లోనే దాదాపు ఒక కోటి కలెక్షన్స్‌ను రాబట్టినట్టు.. ఈ మేనేజ్‌ మెంట్ నుంచి ఓ అఫీషియల్ ట్వీట్ వచ్చింది. ఇది ఎవర్‌ గ్రీన్‌ రికార్డ్‌గా.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లీ కూతురిని గదిలో బంధించి అడ్డుగోడ కట్టేసిన బంధువులు