రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebelstar Prabhas) తో “కల్కి” (Kalki 2898AD) వంటి సెన్సేషనల్ మూవీని క్రియేట్ చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag ashwin). ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా, ఏ యాక్టివిటీ చేసినా అది వైరల్ అవుతోంది. ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ “కలి” (Kali) సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు. యంగ్ హీరోలు ప్రిన్స్(Prince), నరేష్ అగస్త్య (Naresh agasthya) నటించిన సినిమా ఈ సినిమా టీజర్ ను రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు.

“కలి” చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” (Rudra creations) సంస్థ నిర్మించింది. శివ శేషు (Shiva shesu) రచించి దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ తుది దశకు చేరుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.