రజినీకాంత్ (Rajnikanth) హీరోగా నటిస్తున్న కూలీ (coolie) సినిమా షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun pictures) ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. భారీ బడ్జెట్ తో ఈ సన్ పిక్చర్స్ కూలీ చిత్రాన్ని నిర్మిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్నారు.

రజినీ, లోకేష్ కాంబోలో వస్తున్న కూలీ సినిమాపై కోలీవుడ్ లో హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కూలీ అనౌన్స్ మెంట్ సందర్బంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.