బాలీవుడ్ (BOllywood) లో ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebel star Prabhas) కల్కి 2898ఎడి (Kalki 2898AD). ఈ రోజుతో ఈ సినిమా 200 కోట్ల రూపాయల వసూళ్లకు రీచ్ కానుంది. ఈ ఇయర్ లో మరే బాలీవుడ్ మూవీ 200 కోట్ల వసూళ్ల మార్క్ అందుకోలేదు. మైథాలజీ ఇష్టపడే నార్త్ ఆడియెన్స్ కల్కి మూవీని బాగా చూస్తున్నారు.

ఈ సినిమాలో అమితాబ్ (Amitab bachhan), దీపిక (Deepika padukone) లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉండటం కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్ గా 800 కోట్ల రూపాయల మార్క్ దాటేసింది కల్కి. నార్త్ అమెరికాలో 15 మిలియన్ డాలర్స్ ఫ్లస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు స్టేట్స్ లో 150 కోట్ల రూపాయలకు పైగా కల్కి మూవీ దక్కించుకుంది. ఇదంతా కేవలం 10 రోజుల వసూళ్లే. సెకండ్ వీకెండ్ కు కల్కి ఈజీగా 1000 కోట్ల మార్క్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి.