‘అరి’ (ARI) సినిమా నుంచి ఇప్పటిదాకా రివీల్ చేసిన కంటెంట్ కొంచెం సీరియస్ మోడ్ లో ఉండగా..ఫస్ట్ టైమ్ హ్యూమర్ టచ్ ఉన్న అప్డేట్ ఇచ్చారు మేకర్స్. శ్రీనివాస రెడ్డి (Srinivasareddy), చమ్మక్ చంద్ర (Chammak chandra)ను చతుర్ వితుర్ అనే పండితుల పాత్రల్లో పరిచయం చేస్తూ వారి క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. వీరి పాత్రల లుక్స్ చూడగానే నవ్వొచ్చేలా ఉన్నాయి. ఎన్నో సినిమాల్లో అనేక పాత్రల్లో నవ్వించిన శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర చతుర్ వితుర్ గా ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతున్నారు.

అరి సినిమాను ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ (Arvi cinemas) పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల.Ph.D, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్ (Anasuya bharadwaj), సాయి కుమార్ (Sai kumar), శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ‘అరి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. ‘అరి’ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేయనుంది.