సీరియల్‌లో ఎక్కువ క్రేజ్ ఉన్న సీరియల్ ఏది అంటే టక్కున చెప్పే పేరు కార్తికా దీపం ఈ సీరియల్‌కు ఇంతగా క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే వంటలక్క వల్లే అనే చెప్పాలి. ఈ సీరియల్ కు మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి  ప్రసారం అయ్యే ఈ సీరియల్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ లో వంటలక్క తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రేమి విశ్వనాథ్ వంటలక్క పాత్రలో నటించి మెప్పించింది. ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి.. కానీ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కార్తీక దీపం సీరియల్ మొదటి భాగం ఇటీవలే పూర్తయింది. ఇప్పుడు కార్తీక దీపం: ఇది నవ వసంతం అనే పేరుతో కొత్త భాగం మొదలు పెట్టారు.

ఇది కూడా చదవండి : కమల్ హాసన్ స్వాతిముత్యంలో ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి

ఇక ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.. ఆమె ఫ్యామిలీ ఏంటి.? బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది పెద్దగా ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రేమి విశ్వనాథ్ తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేయదు. కానీ తాజాగా కొడుకుతో కలిసి ఓ రీల్ చేసింది ఆమె. ఈ రీల్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి : NTR : “మీ తాత గుద్దిన గుద్దుడికి జ్వరం వచ్చిందన్న హీరోయిన్”.. తారక్ రియాక్షన్ ఏంటంటే..

తాజాగా ప్రేమి షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నడా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు ‘మామ్ అండ్ సన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రేమి. ఆమె కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు. చాలా ఫిట్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు అతను. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్‌లా ఉన్నారు, సంతూర్ మమ్మీ, మీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా .? నిజం చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.