హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఈ రోజు రావాల్సిఉంది. అయితే అనివార్య కారణాలతో ఈ ప్రకటనను రేపటికి వాయిదా వేశారు. ఈ చిత్ర ప్రొడక్షన్ సంస్థ శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ (Sri chakraas entertainments) ఈ విషయాన్ని ప్రకటించింది. రేపు ఉదయం 11.01 నిమిషాలకు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు.

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరపైకి రాబోతోంది. ఈ సినిమాను వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కిరణ్ అబ్బవరం సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ (KA productions) నిర్మించనుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు సౌతిండియన్ లాంగ్వేజెస్ అయిన తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయబోతున్నారు.