నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్ (Ismart shankar), డిస్కో రాజా వంటి మూవీస్ తో అటు గ్లామర్, ఇటు పర్ ఫార్మెన్స్ తో పేరు తెచ్చుకుంది నభా నటేష్ (Nabha natesh). రెండేళ్ల కిందట ప్రమాదవశాత్తూ ఆమె జారి పడటంతో ఎడమ భుజానికి తీవ్రగాయమైంది. మల్టీపుల్ ఫ్రాక్చర్స్ కు సర్జరీ చేయించుకుంది. ఇలాంటి ప్రమాదం తర్వాత మళ్లీ కోలుకుని అంతే ఉత్సాహంతో సినిమాలు చేయడం అంత సులభం కాదు. కానీ పట్టుదల, అంకితభావంతో ఫిట్ నెస్ తెచ్చుకుని మళ్లీ కెరీర్ బిగిన్ చేసింది నభా.

ఆమె తన కొత్త సినిమా డార్లింగ్ (darling) తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న యువతిగా నభా నటనను ట్రైలర్ లో చూసిన వారంతా అప్రిషియేట్ చేస్తున్నారు. హీరో విశ్వక్ సేన్ తో పాటు డైరెక్టర్ అశ్విన్ రామ్ డార్లింగ్ ట్రైలర్ లాంఛ్ వేదిక మీదే నభా డెడికేషన్ , యాక్టింగ్ టాలెంట్ ను మెచ్చుకున్నారు. ఇప్పటిదాకా కమల్ హాసన్, విక్రమ్ లాంటి నటులు మాత్రమే స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్స్ తో మెప్పించారు. వారి తర్వాత ఆ క్రెడిట్ నభానే దక్కించుకుంది.