భారతీయుడు 2 (Bharateeyudu 2) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సిద్ధార్థ్ (Siddharth) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దాంతో వాటిని వెనక్కి తీసుకుంటూ తన మాటల్ని అపార్థం చేసుకున్నారని అన్నాడు సిద్ధార్థ్. తెలంగాణ ప్రభుత్వం (TG govt) డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమంలో స్టార్స్ పాల్గొనాలని, అప్పుడే ప్రభుత్వపరంగా సహకారం ఉంటుందని తెలిపింది. దీనిపై సిద్ధార్థ్ మాట్లాడుతూ మేము మీరు అది చేస్తేనే మేము ఇది చేస్తామని ఇప్పటిదాాకా ఏ ప్రభుత్వం మాకు చెప్పలేదు అన్నాడు. సిద్ధార్థ్ మాటలు వైరల్ కావడంతో మరో వీడియో రిలీజ్ చేశాడు

ఈ వీడియోలో సిద్ధార్థ్ మాట్లాడుతూ సోషల్ ఇష్యూస్ కోసం ప్రచారం చేసేందుకు తామెప్పుడూ ముందుంటామని అన్నాడు. ఈవెంట్ లో తాను మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాడు. సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్త కాదు. తమిళనాడులో ఎన్నోసార్లు ఇలా మాట్లాడాడు. రాజకీయ, మతపర విషయాలపై కూడా సిద్ధార్థ్ గతంలో మాట్లాడిన మాటలు కాంట్రవర్సీలకు దారితీశాయి.