సుధీర్ బాబు (Sudheer babu) హీరోగా నటించిన హరోం హర (Harom Hara) సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఎల్లుండి నుంచి ఈ సినిమా ప్రీమియర్ చేస్తున్నట్లు ఆహా (Aha telugu) అనౌన్స్ చేసింది. గత నెల 14న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలో పాజిటివ్ రెస్పాన్స్ కోసం టీమ్ వెయిట్ చేస్తున్నారు. జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ (Malvika sharma) హీరోయిన్ గా నటించింది.

యాక్షన్ డ్రామా కథతో హరోం హర సినిమా చేశాడు హీరో సుధీర్ బాబు. ఇటీవల తనకు ఫ్లాప్స్ పడుతున్న నేపథ్యంలో ఈ యాక్షన్ డ్రామా సక్సెస్ తీసుకొస్తుందని ఆశించాడు. అయితే అతనికి ఆశించిన ఫలితం దక్కలేదు. కథా కథనాల్లో బలం లేకపోవడం, సెకండాఫ్ మరీ తేలిపోవడంతో హరోం హర ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. రాయలసీమ యాసలో సుధీర్ బాబు క్యారెక్టర్ కొత్తగా అనిపించినా సినిమాను నిలబెట్టలేకపోయింది.