రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebel star prbhas) ను పాన్ ఇండియా స్టార్ ను చేసిన సినిమా బాహుబలి (bahubali). ఈ చిత్రంతో నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ప్రభాస్ అంటే ఎవరో తెలిసింది. స్వర్గీయ కృష్ణంరాజు (krishnam raju) ప్రధాని మోదీ (PM modi )ని కలిసినప్పుడు బాహుబలి పెదనాన్నగా పలకరించారంటే బాహుబలి ప్రభాస్ కు ఇచ్చిన గుర్తింపును అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో మోదీ కట్టప్పను, బాహుబలి పాత్రలను ఉదాహారణగా చెబుతూ మాట్లాడారు. బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అభిమానులు ఏర్పడ్డారు.

ఈ ఐకానిక్ సినిమాకు ఈ రోజుతో 9 ఏళ్లవుతోంది. 9 ఇయర్స్ ఆఫ్ బాహుబలి (9 years of bahubali) అనే యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2015 జూలై 10న బాహుబలి మొదటి భాగం రిలీజైంది. అప్పటికే ఈ మూవీకి విపరీతమైన హైప్ ఉండటంతో థియేటర్స్ వద్ద జాతర సాగింది. ఈ సినిమాకు వచ్చిన సెకండ్ పార్ట్ బాహుబలి ది కన్ క్లూజన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.