బాలీవుడ్‌ హీరోయిన్ ఆలియా భట్‌ (Alia bhatt) తన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆల్ఫా’ (Alpha) షూటింగ్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాను యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ (Yash raj films) స్పై యూనివర్స్ (Spy universe) లో భాగంగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ లో ఈ రోజు అడుగుపెట్టింది ఆలియా భట్‌. ఆమె ‘ఆల్ఫా’ సెట్ లో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటిదాకా షారుక్ (Sharukh khan), సల్మాన్ (Salman khan), హృతిక్ (Hritik roshan) వంటి హీరోలతో హై బడ్జెట్ యాక్షన్ మూవీస్ చేసిన యష్ రాజ్ ఫిలింస్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ హీరోయిన్ తో ఈ జానర్ లో ‘ఆల్ఫా’ మూవీ నిర్మిస్తోంది. ఇందులో ఆలియా సూపర్‌ ఏజెంట్‌ (Super agent)గా కనిపించనుంది. ఈ చిత్రానికి శివ రవైల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.