రొటీన్ కు భిన్నమైన సినిమాలు చేస్తూ కమల్ హాసన్ తర్వాత అంత పేరు తెచ్చుకున్నారు చియాన్ విక్రమ్ (Chiyaan vikram). ఆయన కొత్త సినిమా తంగలాన్ (Thangalaan) ట్రైలర్ చూస్తే ఒక సినిమా కోసం, ఒక పాత్ర కోసం ఆయన పడే శ్రమను మరో నటుడు తీసుకోలేడేమో అనిపిస్తుంది. తంగలాన్ సినిమాలో తెగ నాయకుడిగా కనిపించారు విక్రమ్. తన తెగవారి కోసం ఎలాంటి పోరాటమైనా చేస్తాడు విక్రమ్. తంగలాన్ ట్రైలర్ కాసేపు ప్రేక్షకుల్ని కొత్త ప్రాంతానికి, కొత్త కాలానికి తీసుకెళ్లేలా ఉంది.

బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రమిది. ఈ సినిమాను నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా (KE jnanavel raja) నిర్మించారు. పా రంజిత్ (Pa ranjith) రూపొందించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ (Malvika mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. “తంగలాన్” ట్రైలర్ లో బంగారం కోసం బ్రిటీష్ వారు స్థానిక తెగ వారిని గనుల్లో పనికి తీసుకోవడం, అక్కడి తెగల మధ్య పరస్పరం పోరాటాలు జరగడం ఆసక్తికరంగా చూపించారు. గంగమ్మగా పార్వతీ తిరువోతు, ఆరతిగా మాళవిక మోహనన్ కనిపించారు. విక్రమ్ ఈ పాత్ర కోసం మారిపోయిన తీరు ఆశ్చర్యపరిచేలా ఉంది. ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్సులు, బ్లాక్ పాంథర్ తో చేసిన ఫైట్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. చివరలో విక్రమ్ చెప్పిన చావును ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం అనే డైలాగ్ తంగలాన్ స్టోరీ కోర్ ఐడియాను రిప్లెక్ట్ చేస్తోంది.