తెలుగులో గేమ్ ఛేంజర్ (Game changer), కల్కి (Kalki) వంటి ఎన్నో భారీ పాన్ ఇండియా మూవీస్ పాటలతో మ్యూజిక్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘సారెగమ’ (Saregama). ఈ సంస్థ హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) లేటెస్ట్ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ “క” (KA) మ్యూజిక్ హక్కులు సొంతం చేసుకుంది. ఈ రోజు “క” మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. సామ్ సీఎస్ (Sam cs) సంగీతాన్ని అందిస్తున్న “క” సినిమా సంగీతాన్ని ‘సారెగమ’ మరింతగా మ్యూజిక్ లవర్స్ దగ్గరకు చేర్చనుంది.

“క” సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ (Sujeeth sandeep)విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న “క” సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.