రామ్ చరణ్ (Ram charan) ఉపాసన (Upasana) దంపతులు ముంబైలో రేపు జరగనున్న అనంత్ అంబానీ (Ananth ambani) – రాధిక మర్చంట్(radhika marchant) వివాహ వేడుకలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో చరణ్ ఉపాసన వెళ్తున్న ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఉపాసన ఏడున్నర కోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్ స్పెక్టర్ (rolls royce spectre) కారులో ఎయిర్ పోర్టులో దిగి వెళ్లారు.

దేశంలో ఇది రెండో రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు. రేపటి నుంచి మొదలయ్యే అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలు మూడు రోజుల పాటు సాగనున్నాయి. రెండు ప్రత్యేక ఫాల్కన్ జెట్ విమానాలను అతిథుల కోసం ఏర్పాటు చేయడం, సుమారు 100 ప్రైవేట్ విమానాలను అతిథులను పెళ్లికి తీసుకొచ్చేందుకు రెంట్ కు తీసుకోవడం అనంత్ అంబానీ పెళ్లి ఎంత ఆడంబరంగా జరుగుతుందో తెలియజేస్తోంది. ఈ పెళ్లి వేడుకల మొత్తం ఖర్చు 2 వేల కోట్ల రూపాయలుగా అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. 8 లక్షల కోట్ల రూపాయల ఆస్తిపరుడైన అంబానీ ఇంట పెళ్లికి ఆ మాత్రం ఖర్చు పెద్ద లెక్క కాదనే అనుకోవచ్చు.