ప్రేమ కథలకు ప్రేక్షకులు కనెక్ట్ అయినంత మరే జానర్ కు కారు. ఆ పవర్ లవ్ స్టోరీస్ లో ఉంది. ఇలాంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో సినిమా చేస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ (SKN), దర్శకుడు సాయి రాజేశ్(Sai rajesh). వీరి సంయుక్త నిర్మాణంలో అమృత ప్రొడక్షన్స్ (Amrutha productions), మాస్ మూవీ మేకర్స్ (Mass movie makers) బ్యానర్స్ పై సంతోష్ శోభన్ (Santosh shoban), సోషల్ మీడియా ఫేమ్ అలేఖ్య హారిక (Alekhya harika) హీరో హీరోయిన్లుగా ప్రొడక్షన్ నెం.4 సినిమా తెరకెక్కుతోంది.

ఈరోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పై ‘కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి..’ అనే హార్ట్ టచింగ్ క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. సంతోష్ శోభన్ లుక్ భగ్న ప్రేమికుడిలా ఉంది. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతోంది. ఈ సినిమాతో మరో క్లాసిక్ లవ్ స్టోరీని స్క్రీన్ మీదకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.