దర్శకుడు శంకర్ (Shankar) ఫామ్ కోల్పోయి చాలాకాలమవుతోంది. ఒకప్పుడు ఆయన సినిమా తీశాడంటే అది బ్లాక్ బస్టరే. శంకర్ సినిమాకు తిరుగులేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో ఉండేది. కొద్దికాలంగా శంకర్ సినిమాలు ఆడటం లేదు. స్టోరీ టెల్లింగ్ లో ఆయన సింక్ మిస్ అయ్యింది. భారతీయుడు 2తో అది క్లియర్ గా వెల్లడైంది.

ఈరోజు రిలీజైన భారతీయుడు 2 (Bharateeyudu 2) సినిమాకు అన్ని చోట్ల నుంచి యునానమస్ గా నెగిటివ్ టాక్ వచ్చింది. భారతీయుడు 2 రిజల్ట్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా చేస్తున్నారు. శంకర్ ఈ సినిమాను ఏం చేశాడో అనే కంగారు చరణ్ ఫ్యాన్స్ లో మొదలైంది. ఇప్పటికే చాలా ఆలస్యమైన గేమ్ ఛేంజర్ సక్సెస్ కాకుంటే రామ్ చరణ్ నాలుగేళ్ల టైమ్ వృథా అయినట్లే.