యూవీ కాన్సెప్ట్స్(UV concepts) బ్యానర్ ను పేరుకు తగినట్లే కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలను నిర్మిస్తోంది. రీసెంట్ గా కార్తికేయ (Karthikeya gummakonda) హీరోగా భజే వాయు వేగం (Bhaje vayu vegam) సినిమాతో ఈ సంస్థ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు సంతోష్ శోభన్ (Santhosh shoban) హీరోగా “కపుల్ ఫ్రెండ్లీ” (Couple friendly) అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్ తో పాటు ఈ సినిమా టైటిల్ లుక్ ను యూవీ కాన్సెప్ట్స్ రిలీజ్ చేసింది. “కపుల్ ఫ్రెండ్లీ” చిత్రంలో మిస్ ఇండియా మానస వారణాసి (Manasa varanasi) హీరోయిన్ గా నటిస్తోంది.

లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ (Ashwin chandrashekar) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్.పి. (Ajay kumar. p.) కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. “కపుల్ ఫ్రెండ్లీ” టైటిల్ లుక్ లో చెన్నై సెంట్రల్ స్టేషన్ దగ్గరలోని ఓ రెసిడెన్షియల్ ఏరియాను చూపించారు. చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే ఇంట్రెస్టింగ్ మూవీగా “కపుల్ ఫ్రెండ్లీ” ఉండబోతోంది. బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్స్ తో పేరు తెచ్చుకున్న సంతోష్ శోభన్ ఈ చిత్రంలోనూ అలాగే కనిపిస్తున్నారు.